తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌కు పదోన్నతి - జస్టిస్ సతీష్ చంద్ర శర్మ బదలీ

Justice Ujjal Bhuyan: తెలంగాణ హైకోర్టు సీజే బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు జారీ చేసింది. జస్టిస్ సతీష్ చంద్ర శర్మను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు ఇచ్చింది.

Promotion of Justice Ujjal Bhuyan as State High Court CJ
రాష్ట్ర హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌కు పదోన్నతి

By

Published : May 17, 2022, 2:10 PM IST

Justice Ujjal Bhuyan: రాష్ట్ర హైకోర్టు సీజే బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు ఇచ్చింది. జస్టిస్ సతీష్ చంద్ర శర్మను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం సిఫారసు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌కు పదోన్నతి కల్పించింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ భుయాన్ ఉన్నారు.

కేంద్రం ఈ సిఫారసులను ఆమోదించి, రాష్ట్రపతికి పంపిస్తుంది. ఆయన ఆమోదం పొంది, కేంద్ర న్యాయశాఖ గెజిట్‌ను ప్రచురించాక జస్టిస్ ఉజ్జల్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేస్తారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ దిల్లీ హైకోర్టుకు బదిలీ కావడంతో... రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 11కు చేరుతుంది.

ఇదీ చూడండి: హైకోర్టుకు 12 మంది జడ్జిల నియామకానికి కొలీజియం సిఫార్సు

ABOUT THE AUTHOR

...view details