తెలంగాణ

telangana

ETV Bharat / state

పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులు ప్రమోట్ - తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు

without-examinations-ssc-students-will-get-promoted-says-cm-kcr
పదో తరగతి పరీక్షలు లేకుండానే విద్యార్థులు ప్రమోట్

By

Published : Jun 8, 2020, 5:29 PM IST

Updated : Jun 8, 2020, 6:00 PM IST

17:28 June 08

పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులు ప్రమోట్

రాష్ట్రంలో ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రద్దు చేశారు. పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.  

పదో తరగతి పరీక్షలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్​లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు పాల్గొన్నారు.  

రాష్ట్రంలో 5,34,903 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లుండగా, అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది. ఈ పరీక్షలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని సీఎం నిర్వహించారు. ఈ సమావేశంలో పరీక్షల విషయంలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులను పరిశీలించారు. తెలంగాణలో ఏమి చేయాలనే విషయంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తెలంగాణలో అనుసరించాల్సిన పద్ధతిని ఖరారు చేశారు.

వాటి ఆధారంగానే...

గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరిగణలోకి తీసుకుని పదవ తరగతి విద్యార్థులను పైతరగతికి ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. డిగ్రీ, పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Last Updated : Jun 8, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details