Promise Day Special Article: చాలా మంది అనేక సందర్భాల్లో అనేకమైన ప్రమాణాలు చేస్తారు. చిన్న పిల్లలు అబద్ధం ఆడలేదని చెప్పడానికి ఉపయోగించే మొదటి ఆయుధం. తర్వాత వివాహ సమయంలో కట్టుకునే వారిని కడదాకా ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటాం అని అందరి ముందు ప్రమాణం చేయడం. చివరికి కోర్టుల్లో సాక్ష్యం చెప్పే ముందు.. అంతా నిజమే చెబుతా అని భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా మంది వారి జీవితాల్లో చాలా సార్లు ప్రమాణాలు చేస్తారు.
ప్రేమికులైతేనేమి, భార్య భర్తలు అయితేనేమి.. అది చేస్తాం.. ఇది చేస్తాం అని తాము చేయబోయే పనులు, చూసుకునే విధానం గురించి వివరిస్తూ ప్రామిస్ చేస్తారు. అందులో వాటిని నిలబెట్టుకునేది ఎంత మందో.. ఆ ప్రామిస్ పొందిన వారికే తెలియాలి. ప్రస్తుతం వాలెంటైన్ వీక్ నడుస్తోంది. ఇందులో భాగంగా అయిదో రోజును ప్రామిస్ డే గా జరుపుకొంటారు. నేడు ప్రామిస్ డే కాబట్టి ఇలాంటి వాగ్దానాలు చేస్తే మీ భాగస్వాములకి మీ మీద నమ్మకం ఏర్పడుతుంది.
Never Leave You: “ నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదలను “ అని ప్రామిస్ చేయండి. వారి చేతుల్ని మీ చేతుల్లోకి తీసుకుని ఈ మాటను చెప్పండి. కచ్చితంగా వారిని మీరు ఆకట్టుకునే వారు అవుతారు. అయితే.. ఈ మాట నిజంగా మీ గుండె లోతుల్లో నుంచి రావాలి. వాళ్లను ఇంప్రెస్ చేయడానికో లేదా చెప్పకుంటే వాళ్లు బాధ పడతారు అని మాత్రం చెప్పకండి.
Always Respects You: “ నిన్ను ఎప్పటికీ గౌరవిస్తాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇతరుల ముందు నీ గౌరవానికి భంగం కలిగించను, నిన్ను ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడను“ అని ప్రమాణం చేయండి. చేయడమే కాదు. అలాగే ప్రవర్తించాలి కూడా. ఇలా అయితే మీ మీద మంచి అభిప్రాయం కలుగుతుంది.
Always Help You: నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తా. కేవలం సుఖ సంతోషాల్లోనే కాదు.. కష్టంలోనూ తోడుగా ఉంటానని ప్రమాణం చేయండి. అన్నింటికి మించి ఆ సమయంలో నీకు అవసరమైన నైతిక మద్దతు అందిస్తా అని వాగ్దానం చేయండి. అక్కడితోనే ఆగిపోకుండా.. ఆ సమయం వచ్చినప్పుడు చేసి.. మిమ్మల్లి మీరు నిరూపించుకోండి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
Promise To Spend time: చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ సమయం దొరకని వాళ్లు.. మీ ప్రియులతో ఇప్పటి నుంచి మీకు కచ్చితంగా సమయం కేటాయిస్తా" అని చెప్పండి. మీ ప్రేమపై ఉన్న నమ్మకం మరింత పెరుగుతుంది. అంతే కాదు మీ పైన కూడా ఉన్న నమ్మకం రెట్టింపు అవుతుంది.
Believable Promise: చాలా మంది ప్రేమికులు ప్రేమ పుట్టిన కొత్తలో తన మీద నమ్మకం పెరగడానికి ఏదేదో చెబుతారు. వారిని నమ్మడానికి ఇష్టానుసారంగా వాగ్దానాలు చేస్తారు. నమ్మశక్యం కాని ప్రమాణాలు చేస్తూ ఉంటారు. ఇలా కల్లిబిల్లి మాటలు చెప్పడం సులభమే.. కానీ ఆ తర్వాత ప్రేమలో ఉన్నప్పుడు ఈ మాటలు నెరవేర్చడం కష్టతరం అవుతాయి. సో బీ కేర్ పుల్.. మీరు చెప్పింది నెరవేర్చని రోజు అనేది వస్తే.. ఏం చేస్తారు. మీరే బాధ పడతారు. ఫలితంగా మీపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోతారు. కాబట్టి.. లేని పోని గొప్పలకు పోకుండా.. నమ్మకమైన, నెరవేర్చగిలిగే వాగ్దానాలనే ఇవ్వండి.
ప్రామిస్‌లు ఇవ్వడమే కాదు.. వాటిని నిలబెట్టుకునేలా ప్రవర్తిచండి. సమయం, సందర్భం వచ్చినప్పుడు వాటిని చేసి చూపించి మీ నిజాయతీని చాటుకోండి. అప్పుడే తెలుస్తుంది మీరు ఎదుటి వ్యక్తిని ఎంతలా ప్రేమిస్తున్నారో అని.. ఈ ఒకే ఒక్క ప్రామిస్తో మీరు మీ జీవిత భాగస్వామికి ఎంతో గొప్ప బహుమతిని ఇవ్వగలరు. ఈ ప్రామిస్నే నిన్న నీ ప్రేమను చివరి వరకు తీసుకొని వెళుతుంది. సో ప్రామిస్ చేసేటప్పుడు ఈ విషయాలు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకో.. ఇంకెందుకు మరి ఆలస్యం ఈ ప్రామిస్ డే రోజున నీకు ఇష్ట సఖికి 'ఉరికే చిలకా.. వేచి ఉంటాను కడవరకు..'అంటూ ప్రామిస్ చేసేయండి. నీ ప్రేమకు పునాదులు మరింతగా నిర్మించుకోండి. హ్యాపీ ప్రామిస్ డే.. అండ్ ఆల్ ది బెస్ట్
ఇవీ చదవండి: