gandhi hospital rape: అత్యాచారం చేయలేదు.. ఆమె అంగీకారంతోనే వెళ్లా: సెక్యూరిటీ గార్డు - telangana varthalu
13:09 August 19
గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఆరోపణల కేసులో పురోగతి
సంచలనం రేపిన గాంధీ ఆస్పత్రిలో అత్యాచార కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆరోపణల తర్వాత కనిపించకుండా పోయిన ఆస్పత్రి భద్రతా సిబ్బంది విజయ కిశోర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా కొన్ని విషయాలు వెల్లడించాడు. తాను మహిళపై అత్యాచారం చేయలేదని.. మహిళ అంగీకారంతోనే శారీరకంగా కలిసినట్లు సెక్యూరిటీ గార్డు విజయ కిశోర్ పోలీసులకు తెలిపాడు. గత నెల 27న గాంధీలో సెక్యూరిటీ గార్డుగా చేరినట్లు పోలీసులకు విచారణలో చెప్పాడు. గాంధీ ఆస్పత్రి ఘటనలో అదృశ్యమైన మహిళను హిమాయత్‌నగర్‌లో గుర్తించారు . ఓ మెడికల్ దుకాణం వద్ద సంచరిస్తుండగా నారాయణగూడ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా.. గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఘటన గురించి చెప్పినట్లు వెల్లడించారు.
మహబూబ్‌నగర్ నుంచి ఈ నెల 5 న మూత్రపిండాల వ్యాధి నయం కోసం వచ్చిన ఓ రోగికి అతడి భార్య, మరదలు సాయంగా వచ్చారు. తమపై అత్యాచారం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత అదృశ్యమైన బాధితురాలి సోదరి కోసం.. విస్తృతంగా గాలించిన పోలీసులు నారాయణ గూడలో గుర్తించారు..
సంబంధిత కథనాలు:
- Gandhi Hospital Rape: గాంధీ ఘటనలో వీడని చిక్కుముడి.. ఇంకా లభించని బాధితురాలి ఆచూకీ
- GANDHI HOSPITAL: 'గాంధీలో అత్యాచారం జరిగే అవకాశం లేదు.. బురద జల్లే ప్రయత్నం చేయొద్దు'
- Gandhi Hospital Rape Case: 'గాంధీ'లో అత్యాచారంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం
- Gandhi Hospital Rape: 'గాంధీలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం' కేసులో సూపరింటెండెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు
- GANDHI HOSPITAL RAPE CASE: 'గాంధీ'లో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. అక్కడ ప్రతిదీ అనుమానమే!