తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్య కుట్ర కేసులో పురోగతి.. మరో నలుగురు రిమాండ్‌కు తరలింపు

Srinivas Goud Murder Plan: రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర పన్నిన విషయం తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటికే 8మందిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కుట్రలో ఎవరెవరి పాత్ర ఉందనే విషయంపై పోలీసుల ఆరా తీస్తున్నారు. 15 కోట్ల రూపాయల సుపారీకి సంబంధించిన వివరాలు రాబట్టేందుకు పోలీసులు కూపీ లాగుతున్నారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర కేసులో పురోగతి.. 8 మంది రిమాండ్​కు తరలింపు
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర కేసులో పురోగతి.. 8 మంది రిమాండ్​కు తరలింపు

By

Published : Mar 3, 2022, 12:26 PM IST

Srinivas Goud Murder Plan:మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటికే 8మందిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిన్న నలుగురిని రిమాండ్‌కు పంపింన పేట్‌బషీరాబాద్‌ పోలీసులు ఇవాళ.. రాఘవేంద్రరాజు, అమరేంద్రరాజు, రవి, మధుసూదన్‌ను రిమాండ్‌కు పంపించారు. కుట్రలో ఎవరెవరి పాత్ర ఉందనే విషయంపై పోలీసుల ఆరా తీస్తున్నారు. 15 కోట్ల రూపాయల సుపారీకి సంబంధించిన వివరాలు రాబట్టేందుకు పోలీసులు కూపీ లాగుతున్నారు. నిందితులను కస్టడీకి తీసుకుని విచారణ జరపాలని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ హత్యాయత్నం ఘటనతో కుట్ర వివరాలు బయటపడ్డాయని బుధవారం పోలీసులు వెల్లడించారు.

సుచిత్ర కూడలిలో ఫరూక్​, హైదర్‌ అలీ అనే వ్యక్తులపై ఫిబ్రవరి 25న హత్యాయత్నం జరిగిందని.. నిందితులు యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్‌లను 26న అరెస్టు చేసి 27న రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. హత్యాయత్నంపై ప్రశ్నిస్తున్న క్రమంలో కుట్ర కోణం బయటపడిందని వివరించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు, అమరేందర్‌ రాజు, మధుసూదన్‌ రాజు... మరికొందరితో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హత్యకు కుట్ర జరిగిందని తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఇందుకోసం రాఘువేంద్ర రాజు ఫరూక్‌తో కలిసి 15 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారని.. కుట్రకు సంబంధించి మిగతావారి పాత్రపై నిందితులను కస్టడీకి తీసుకుని లోతుగా విచారిస్తామని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

సంబంధిత కథనాలు:

ABOUT THE AUTHOR

...view details