రష్యా తీసుకున్న నిర్ణయం అనూహ్యమైంది. అధికార విస్తరణ కోసమే పుతిన్ దూకుడు పెంచారు. పూర్వవైభవం సంపాదించుకోవాలని పుతిన్ ఆలోచన రష్యాలోని కొన్ని వర్గాల్లో పుతిన్‌పై అసంతృప్తి కూడా ఉంది. పుతిన్ తనపై ఉన్న ప్రతికూలతను తగ్గించేందుకు ఇలా వ్యవహరిస్తున్నాడని భావించవచ్చు. అందరు రష్యన్లు పుతిన్‌ను సమర్థిస్తారని భావించలేం. పుతిన్ అధికార దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఉక్రెయిన్‌పై దాడితో పుతిన్ ప్రతిష్ఠకు మచ్చ తప్పదు. అమెరికా రంగంలోకి దిగే అవకాశాలు చాలా తక్కువ. అమెరికా పశ్చిమ దేశాలతో కలిసి ఒత్తిడి తీసుకురావచ్చు. ఉక్రెయిన్‌ను దెబ్బకొట్టి వదిలేయాలన్నది రష్యా ఆలోచన. ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి ఆధిపత్యం కోసమే రష్యా ఈ చర్యలు చేపడుతోంది. భారత్ ఈ అంశంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. రష్యా, భారత్ మధ్య మైత్రి బంధం ఇప్పటిది కాదు. భారత్ ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదు. ఇప్పుడు భారత్ మాట్లాడినా పెద్దగా ప్రయోజనం లేదు. విదేశాంగ మంత్రి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఐరాస భద్రతా మండలిలో చైనా రష్యాకే మద్దతునిస్తుంది. తీర్మానం ప్రవేశ పెట్టేంత పరిస్థితులు రావనే భావిస్తున్నాను. సంయమనం పాటించాలనే సూచనలకే అందరూ పరిమితం. యుద్ధం కన్నా భయపెట్టటమే రష్యాకు మేలు చేస్తుంది. ప్రస్తుత యుద్ధం వల్ల ఎక్కువగా నష్టపోయేది రష్యాయే. ఈ తరుణంలో భారత్ ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది.
Russia-Ukraine Crisis: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా.. నిపుణులు ఏం అంటున్నారంటే?!
Russia-Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న సంగతి ప్రపంచమంతా గమనిస్తూనే ఉంది. అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నా రష్యా వెనక్క తగ్గకుండా దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారనుందా అన్న చర్చ తెరపైకి వస్తోంది. ఈ అంశంపై నిపుణులు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నా.. ఎక్కువ మంది వినిపిస్తున్న మాట.. ఆ పరిస్థితి రాదు అనే. రాజనీతి శాస్త్ర ఆచార్యులు ప్రసన్న కుమార్ అభిప్రాయమూ ఇదే. కేవలం ఉక్రెయిన్‌ను భయపెట్టి తన ఆధీనంలోకి తీసుకొచ్చే ప్రయత్నంగానే ప్రస్తుత పరిణామాలను అభివర్ణిస్తున్నారాయన. యుద్ధం వల్ల రష్యాకే నష్టం తప్పదని వివరిస్తున్నారు. కేవలం సూపర్ పవర్ ట్యాగ్ కోసమే రష్యా ఇలా దూకుడుగా వ్యవహరిస్తోందని అంటున్న ప్రొఫెసర్ ప్రసన్న కుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
Russia-Ukraine Crisis: 'ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ఎందుకు..?'
-ప్రసన్న కుమార్, రాజనీతి శాస్త్ర ఆచార్యులు
ఇవీ చదవండి: