తెలంగాణ

telangana

ETV Bharat / state

పోస్టుల భర్తీకి జాబ్ బరో... లేకుంటే జైలు బరో - Teachers Protest at Indira park

హైదరాబాద్​ ఇందిరాపార్కు వద్ద జాక్టో, ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫ్రొఫెసర్ నాగేశ్వర్​​తో పాటు ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు.

పోస్టుల భర్తీకి జాబ్ బరో... లేకుంటే జైలు బరో
పోస్టుల భర్తీకి జాబ్ బరో... లేకుంటే జైలు బరో

By

Published : Dec 29, 2020, 4:34 PM IST

Updated : Dec 29, 2020, 5:01 PM IST

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జాబ్‌ బరో పిలుపునిచ్చామని... లేదంటే జైలు బరో చేపట్టాల్సి ఉంటుందని ఫ్రొఫెసర్‌ నాగేశ్వర్‌ హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని నాగేశ్వర్ చెప్పారు. హైదరాబాద్​ ఇందిరాపార్కు వద్ద జాక్టో, ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి సంయుక్తంగా నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఫ్రొఫెసర్​తో పాటు ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు.

పెన్షన్ మానవ హక్కని నాగేశ్వర్‌ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు పీఆర్సీ ఇవ్వాలని.. పోరాటం ఆపే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ రాంచంద్రారావు తెలిపారు. ప్రభుత్వానికి ఉపాధ్యాయులు, విద్యా వ్యవస్థపై శ్రద్ధలేదని విమర్శించారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఖాళీలను భర్తీ చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రమని చెప్పి పీఆర్సీ ఎందుకివ్వడం లేదని నిలదీశారు.

ఇదీ చదవండి:కర్ణాటక మండలి ఉపసభాపతి ఆత్మహత్య

Last Updated : Dec 29, 2020, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details