తెలంగాణ

telangana

ETV Bharat / state

"టీఆర్ఎస్​, బీఆర్​ఎస్​గా మార్చడం అంటే తల్లి పెట్టిన పేరు మార్చుకున్నట్లే" - Bharat Rashtra Samithi

Kodandaram reaction to TRS becoming BRS: ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన టీఆర్​ఎస్​.. ఇప్పుడు భారత్​ రాష్ట్ర సమితిగా మారి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామనడం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ అన్నారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి మాట్లాడిన ఆయన.. తెలంగాణ పోరాటం ఇచ్చిన స్ఫూర్తి.. ఉద్యమ చరిత్ర, బలిదానాలు వల్ల ఆవిర్భవించిన టీఆర్​ఎస్​ను, బీఆర్​ఎస్​గా మార్చడం అంటే తల్లి పెట్టిన పేరు మార్చుకున్నట్లేనని తప్పుపట్టారు.

Professor Kodandaram
Professor Kodandaram

By

Published : Dec 10, 2022, 5:06 PM IST

Kodandaram reaction on BRS: తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా నామకరణం చేసి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని కేసీఆర్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్ నాంపల్లి పార్టీ కార్యాలయంలో నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ పోరాటం ఇచ్చిన స్ఫూర్తి.. ఉద్యమ చరిత్ర, బలిదానాల వల్ల ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్​ రాష్ట్ర సమితిగా మార్చడం అంటే తల్లి పెట్టిన పేరు మార్చుకున్నట్లేనని తప్పుపట్టారు.

మునుగోడు గెలుపు ప్రజల గెలుపు కాదు పైసలు గెలుపు:ఇది ప్రజల ఆకాంక్షలకు భిన్నం అని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయడానికి.. ప్రజలను గెలిపించడానికి అంటూ తెలంగాణలో నమూనా రాజ్యం తెస్తామని చెప్పడం.. ఆ వాస్తవాలు పరిశీలిస్తే మునుగోడు, హుజూరాబాద్ ఎన్నికలు అద్దం పడతాయని గుర్తు చేశారు. అది ప్రజల గెలుపు కాదు.. పైసల గెలుపేనని ఆరోపించారు. ఆ ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ. 3 నుంచి 6 వేల రూపాయలు కుమ్మరించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన టీఆర్​ఎస్.. బీఆర్​ఎస్​గా మారడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని ధ్వజమెత్తారు.

విపక్షాలు ఎక్కడ సభలు పెట్టినా అరెస్టు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆక్షేపించారు. వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్తానం యాత్ర చేస్తానంటే అరెస్టు చేశారని తప్పుపట్టారు. బండి సంజయ్‌ పాదయాత్ర కోసం కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యం, రైతు రాజ్యం తెస్తామంటే ఎవరూ విశ్వసించరని అన్నారు. ఇంకా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతోన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రూ. 30 వేల కోట్లు దారిమళ్లాయి: బ్యాంకులు, సహకార సంఘాలు ఇస్తున్న రుణాలు ఒక ఎత్తైతే.. రుణమాఫీ అమలుకు నోచుకోకపోవడం, కౌలు రైతులకు రైతుబంధు, బీమా లేకపోవడంతో ఒక్కో రైతు సగటున రూ.1.52 లక్షల రూపాయల అప్పుల భారం మోస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రూ. 30 వేల కోట్ల రూపాయలు దారిమళ్లాయని.. ప్రాజెక్టు నిర్వహణకు ఏటా రూ. 27 వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని ఆయన మండిపట్టారు.

"కేవలం తెలంగాణ అనే పేరును మోయడానికి టీఆర్​ఎస్​కు ఇష్టం లేదని తేలిపోయింది. అమరుల ఆకాంక్షను వదులుకోవడానికి సిద్ధపడిందని తెలిసిపోయింది. మనం ఇచ్చిన పేరును మన పోరాటాలతో మనం టీఆర్​ఎస్​కు ఇచ్చిన జీవితాన్ని వదులుకోవడానికి సిద్ధపడింది. టీఆర్​ఎస్​తో పేగు బంధం తెగిపోయింది. మనమందరం మళ్లీ ఒక తాటిపైకి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను."- ప్రోఫెసర్​ కోదండరామ్​, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రోఫెసర్​ కోదండరామ్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details