నాలుగుకోట్ల మందిలో తెలంగాణ ఉద్యమ చైతన్యం రగిలించిన సిద్ధాంత కర్త, స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను హైదరాబాద్లోని ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.
ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబరు, స్థానిక కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్ ... గాంధీనగర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తొలి, మలిదశ ఉద్యమాల్లో ఆయన సేవలను స్మరించుకున్నారు.