ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందిస్తున్న వ్యవసాయ, అగ్రీ ఇంజనీరింగ్, ఆర్గానిక్ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకు గల అర్హతల్లో సడలింపులిచ్చింది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో జరిగిన విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ తెలిపారు.
గతంలో నాలుగేళ్లపాటు గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులు మాత్రమే గ్రామీణ కోటాకు అర్హులు అన్న నిబంధన ఉండేది. ఇప్పడు దాన్ని సవరించారు. అలాగే గతంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు కాగా... ఇక మీదట నుంచి ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు సైతం అర్హులని పేర్కొన్నారు. పాలిసెట్‌లో ర్యాంకు పొంది మెరిట్ సాధించిన అభ్యర్థులు సైతం డిప్లొమాలో ప్రవేశాలకు అర్హులుగా నిర్ణయించడంతో ఆ కోర్సులకు డిమాండ్ పెరిగినట్లైంది.