TS Schools Badi Bata Programme 2023 :విద్యార్థులంతా ధారాళంగా చదవాలి.. వారికి చదవడం ఒక అలవాటుగా మారాలి.. స్వతంత్ర పాఠకులుగా ఎదగాలి అనే లక్ష్యంతో సోమవారం(ఈ నెల 26) నుంచి జులై 31 వరకు అన్ని పాఠశాలల్లో పఠనోత్సవాన్ని నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు రోజూ ప్రతి తరగతికి ఒక పీరియడ్‌ను పఠనానికి కేటాయించాలని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు "ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయుడు బోధనలో పిల్లలతో పాఠ్యాంశాన్ని 10 నిమిషాల పాటు పెద్దగా చదవడం చేయించాలి. కీలక పదాలను స్కూల్‌లోని బోర్డుపై రాయాలి.
- Telangana Badi Bata Schedule 2023 : 'సర్కారు బడికే సై'.. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3 నుంచి బడిబాట
- కొత్తగా 'మన బడి'.. ప్రారంభోత్సవానికి సిద్ధమైన 1210 పాఠశాలలు
Badi Bata Telangana 2023 :విద్యార్థులకు రోజూ స్కూల్ గ్రంథాలయంలోని పుస్తకాలను చదవడానికి ఒక పీరియడ్ కేటాయించాలి. వారంలో మూడు రోజులు మాతృభాషవి, మరో మూడు రోజులు ఆంగ్ల భాషలోని కథల పుస్తకాలను వారి చేత చదివించాలి. విద్యార్థులను గ్రంథాలయ కమిటీలుగా ఏర్పాటు చేయాలి. ఉదయం జరిగే అసెంబ్లీలో ప్రతిరోజూ ఇద్దరు/ముగ్గురు పిల్లలతో కథల పుస్తకాలను చదివించాలి. బడుల్లో ప్రతి శనివారం పఠన పోటీలు జరపాలి. అన్ని పాఠశాలల్లో జులై 10 నుంచి 15 వరకు గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించాలి" అని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. బడుల్లో పిల్లల నమోదు కోసం మరోసారి ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం చేపట్టాలని విద్యాశాఖ సంచాలకురాలు శ్రీ దేవసేన ఆదేశాలు ఇచ్చారు. తరగతులకు ఎటువంటి ఆటంకం కలగకుండా నిర్వహించాలన్నారు.