ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు చర్చలకు సిద్ధమైనప్పటికీ... ఆ ప్రకియ జరగడానికి కొన్ని ఏళ్లు పడుతుందని పౌర హక్కుల సంఘం నేత ఆచార్య హరగోపాల్ అభిప్రాయపడ్డారు. చర్చల ప్రక్రియ క్లిష్టమైనదని ఆయన పేర్కొన్నారు. చర్చల కోసం చాలామంది గతంలో చాలా ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. రెండు వైపుల నుంచి ప్రయత్నం జరిగితేనే శాంతియుత పరిష్కారం లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
మావోయిస్టులకు, ప్రభుత్వానికి మధ్య చర్చల ప్రక్రియ క్లిష్టమైనది: హరగోపాల్ - తెలంగాణ వార్తలు
మావోయిస్టులు, ప్రభుత్వం చర్చలకు సిద్ధమైనప్పటికీ ఆ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని ఆచార్య హరగోపాల్ అన్నారు. పౌరసమాజం చొరవ తీసుకుంటేనే చర్చలు సాధ్యమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో చర్చల కోసం చాలామంది చాలా ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో భౌతిక పరిస్థితుల కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రొ. హరగోపాల్ ఇంటర్వ్యూ, ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల దాడులు
ఛత్తీస్‌గఢ్‌లో భౌతిక పరిస్థితుల కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం, మావోయిస్టులు అనుకుంటే చర్చలు జరగవని... పౌరసమాజం చొరవ తీసుకుంటేనే చర్చలు సాధ్యపడతాయని చెబుతున్న హరగోపాల్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చదవండి:యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన మహోత్సవం