ఈనెల 27న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. కొవిడ్ -19 నేపథ్యంలో మార్గదర్శకాలు అనుసరించి ఆన్‌లైన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ స్నాతకోత్సవం మార్చి 18న జరగాల్సి ఉంది. కానీ కరోనాతో వాయిదా వేశారు.
విద్యార్థులు భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ తమిళసై సౌందరరాజన్ అనుమతితో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో యూనివర్సిటీ సమావేశ మందిరంలో ఈ స్నాతకోత్సవం నిర్వహించాలని వర్సిటీ యాజమాన్యం నిర్ణయించింది. గవర్నర్ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమానికి నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు.