తెలంగాణ

telangana

ETV Bharat / state

'వరవరరావు, సాయిబాబాలను విడుదల చేయించాలి' - ఫ్రొ. హరగోపాల్‌ తాజా వార్తలు

మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిన వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని నిర్బంధ వ్యతిరేక వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

prof. haragopal demanding that Varavararao, Saibaba should be released
'వరవరరావు, సాయిబాబాలను విడుదల చేయించాలి'

By

Published : May 31, 2020, 12:22 PM IST

Updated : May 31, 2020, 1:29 PM IST

ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక (ఊపా) చట్టాన్ని ఎత్తివేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిన వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో నిర్బంధ వాతావరణాన్ని సృష్టించారని సామాజిక ఉద్యమకారుడు ప్రొ.హరగోపాల్‌ వ్యాఖ్యానించారు. ఇందుకోసమేనా ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి మారాలని.. ప్రజాస్వామ్య వాతావరణం రావాలని సూచించారు. ప్రశ్నించే వారిని అక్రమంగా అరెస్టు చేయడం సరైంది కాదని అన్నారు. వరవరరావును బెయిల్‌పై విడుదల చేసేలా చూడాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. ప్రజల పక్షాన పోరాడే వారికి ప్రజలు అండగా నిలవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

'వరవరరావు, సాయిబాబాలను విడుదల చేయించాలి'

ఇదీచూడండి: జూన్ 1నుంచి గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

Last Updated : May 31, 2020, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details