హెచ్‌సీయూ తాత్కాలిక వీసీగా అరుణ్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు వీసీగా ఉన్న పొదిలె అప్పారావు... అరుణ్ అగర్వాల్‌కు బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు. మాజీ వీసీ పొదిలె అప్పారావు పదవీకాలం గతేడాదే ముగిసినప్పటికీ... కొవిడ్ వల్ల విద్యా సంవత్సరం గందరగోళంగా మారడం వల్ల ఆయననే కొనసాగించారు. అయితే తనను రిలీవ్ చేయాలని మాజీ వీసీ అప్పారావు మార్చిలో చేసిన విజ్ఞప్తిని.. రాష్ట్రపతి ఇటీవలే ఆమోదించారు.
హెచ్‌సీయూ తాత్కాలిక ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ అగర్వాల్ - తెలంగాణ తాజా వార్తలు
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తాత్కాలిక ఉపకులపతిగా అత్యంత సీనియర్ ప్రొఫెసర్ అరుణ్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు వీసీగా ఉన్న పొదిలె అప్పారావు పదవీకాలం గతేడాది ముగిసింది.
![హెచ్‌సీయూ తాత్కాలిక ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ అగర్వాల్ Telangana news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:46:22:1623114982-12052420-d.jpg)
హైదరాబాద్ వార్తలు
దిల్లీ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ , కంప్యూటర్స్‌లో పీహెచ్డీ పూర్తి చేసిన ప్రొఫెసర్ అగర్వాల్ హెచ్‌సీయూలో అత్యంత సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. పూర్తి స్థాయి వీసీని నియమించే వరకు ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి:PRC: ఉద్యోగులకు గుడ్‌న్యూస్... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!