తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓ నిర్మాతపై మరో నిర్మాత పోలీసులకు ఫిర్యాదు - తెలుగు నిర్మాత నట్టి కుమార్‌ తాజా వార్తలు

నిర్మాత నట్టి కుమార్‌ మరో నిర్మాత చంటి అడ్డాల మీద బంజారాహిల్స్ పోలీస్​స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నువ్వంటే ఇష్టం సినిమా విషయంలో తనను చంటి అడ్డాల మోసం చేసినట్లు నట్టి కుమార్ తెలిపారు. ఆ సినిమాను తనకు కాకుండా మరో ముగ్గురికి విక్రయించాడని నట్టి పేర్కొన్నారు.

producer natti kumar complained to the police against producer chanti cheated
ఆ నిర్మాత తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు

By

Published : Oct 1, 2020, 3:56 PM IST

ఆ నిర్మాత తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు

చిత్ర పరిశ్రమలో ఇద్దరు నిర్మాతల మధ్య వివాదం నెలకొంది. ఓ సినిమా వ్యవహారంలో నిర్మాత నట్టి కుమార్‌ మరో నిర్మాత చంటి అడ్డాల మీద బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తననే మోసం చేసి తానే మోసం చేసినట్లు చంటి అడ్డాల పోలీసులకు ఫిర్యాదు చేశాడని.. నట్టి కుమార్ తెలిపారు.

నువ్వంటే ఇష్టం సినిమా విషయంలో తనను చంటి అడ్డాల మోసం చేసినట్లు నట్టి కుమార్ తెలిపారు. ఆ సినిమాను తనకు కాకుండా వేరే ముగ్గురికి విక్రయించాడని నట్టి పేర్కొన్నారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ను చంటి అడ్డాల మేనేజ్ చేసి తన పైనే కేసు పెట్టాడని తెలిపారు. ఆ సినిమా పనులు ఇంకా పది రోజుల బ్యాలెన్స్ ఉందని.. ప్రస్తుతం కీర్తీ సురేష్‌ డిమాండ్ పెరిగిందని నట్టి కుమార్ వివరించారు.

ఇదీ చూడండి :'సొంత పొలాల్లోనే కూలీలుగా మారే స్థితికి భాజపా తీసుకొచ్చింది'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details