'పోలీసులు అందిస్తోన్న సేవలపై మంచి చిత్రాన్ని తీస్తా..' - LOCK DOWN EFFECTS
కరోనా కాలంలో నిరంతరం శ్రమిస్తున్న పోలీసులపై ఓ మంచి చిత్రాన్ని నిర్మిస్తానని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. హైదరాబాద్ మెహిదీపట్నంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు.
!['పోలీసులు అందిస్తోన్న సేవలపై మంచి చిత్రాన్ని తీస్తా..' PRODUCER DIL RAJU DISTRIBUTED MASK AND SANITAIZERS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6827111-704-6827111-1587111642000.jpg)
'పోలీసులపై మంచి చిత్రాన్ని తీస్తా..'
పోలీసులు చేస్తోన్న సేవ ఎంతో గొప్పదని సినీ నిర్మాత దిల్‌రాజు కొనియాడారు. హైదరాబాద్ మెహిదీపట్నంలోని రైతుబజార్ చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఎన్నో సినిమాలు తీసిన తాను.. కరోనా కష్టకాలంలో నిరంతరం కృషి చేస్తున్న పోలీసులపై ఓ మంచి చిత్రాన్ని తీస్తానని తెలిపారు. ప్రజలంతా పోలీసులకు సహకరించి కరోనాను తరిమికొట్టాలని సూచించారు.