తెలంగాణ

telangana

ETV Bharat / state

గూటికి చేరే దారే లేదంటూ... వలస కూలీల కన్నీరు - ఆంధ్రప్రదేశ్ అనంతపురం వలస కార్మికులు

లాక్​డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా మడకశిరలోని వలస కూలీలు పడరాని పాట్లు పడుతున్నారు. తిండి లేక ఉండటానికి గూడు లేక కొందరైతే చెట్లకిందే ఉంటున్నారు. ప్రభుత్వం వలస కూలీలను స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ... కొందరిని ఇక్కడే ఉంచటంపై కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను స్వస్థలాలకు పంపేయాలని కోరుతున్నారు.

గూటికి చేరే దారే లేదంటూ... వలస కూలీల కన్నీరు
గూటికి చేరే దారే లేదంటూ... వలస కూలీల కన్నీరు

By

Published : May 6, 2020, 8:38 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా మడకశిరకు జార్ఘండ్​, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు తమ స్వస్థలాలకు పంపాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. లాక్​డౌన్ కారణంగా ఇప్పటికే చాలా ఇబ్బందులు పడ్డామని కనీసం ఇకనైనా తమను తమ గూటికి పంపించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గ్రీన్ జోన్​లో ఉన్న వలస కూలీలను తరలించే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తున్నప్పటికీ... వీరి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించటం గమనార్హం.

తిండి లేక... చేతిలో డబ్బులు లేక తమ వారు పంపుతున్న డబ్బుతో జీవిస్తున్నామని ఇక్కడి వలస కూలీలు చెపుతున్నారు. తమకు కరోనా పరీక్షలు నెగిటివ్ వచ్చినప్పటికీ... అధికారులు తమను ఇక్కడే ఉంచారని వాపోతున్నారు. కన్నవాళ్లకు, కడుపున పుట్టిన వాళ్లకు, కట్టుకున్న భార్యకు ఇంకా దూరంగా ఉండి బతకలేమని... తమను తమ స్వస్థలాకు పంపిస్తే ఎలాగోలా బతికేస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు

ABOUT THE AUTHOR

...view details