అసలేం జరిగిందంటే...!
రజత్ కుమర్, ఓపీ రావత్‌ల పేర్లతో ఓటరు గుర్తింపు కార్డులు జారీ అయ్యాయని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అధికారులు గత నెలలో హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఆసక్తికర విషయాలు తెలిశాయి. గుర్తు తెలియని వ్యక్తులు 4 నెలల క్రితం జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగానికి దరఖాస్తు చేసుకున్నారు. విద్యుత్ బిల్లులు, ఆధార్కార్డులూ సమర్పించారు. కనీస పరిశీలన లేకుండానే జీహెచ్‌ఎంసీ అధికారులు కొద్దిరోజులకే ఇద్దరి పేర్లతో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేశారు.
వాళ్లు సమాచారమిస్తేనే...!
అసలు వాళ్లు సమర్పించిన ఆధార్ కార్డులు అసలువా... నఖిలీవా తేల్చాలంటూ... ఆధార్ సంస్థకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఓటరు గుర్తింపు కార్డులో ఉన్న చిరునామా ఆధారంగా మెహదీపట్నంలోని ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. ఇరవైఏళ్లుగా అదే ఇంట్లో ఉంటున్న తమకు ఏమీ తెలియదని యజమానులు వాపోయారు. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లోని దరఖాస్తు వివరాలను కోరగా.. ఐటీ విభాగం నుంచి సరైన స్పందన లేదని సీసీఎస్ అధికారి తెలిపారు. దరఖాస్తులు ఎక్కడినుంచి వచ్చాయో తెలిస్తే దర్యాప్తు వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. సాంకేతిక సమాచారాన్ని జీహెచ్‌ఎంసీ ఐటీ విభాగం ఇస్తేనే.. అన్ని విషయాలు బహిర్గతమవుతాయని సీసీఎస్ అదికారులు స్పష్టం చేశారు.
కార్డులొచ్చాయి..కానీ ఎలా..? - OP RAWATH
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, భారత ఎన్నికల మాజీ ప్రధాన అధికారి ఓపీ రావత్‌ల పేర్లతో నాంపల్లి నియోజకవర్గంలో ఓటరు కార్డులు జారీ అయ్యాయి. కానీ... అవి వాళ్లు దరఖాస్తు చేసుకున్నవి కావండోయ్...! మరి ఎవరు చేశారు... ఎందుకు చేశారు... ఎలా చేశారు....?
![కార్డులొచ్చాయి..కానీ ఎలా..?](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2498267-1047-5a1b2962-b4ee-45a1-8137-671250c0a93e.jpg)
గుర్తింపు కార్డుల గలాటా...!
ఇదీ చదవండి:లేదంటే జైలుకే
Last Updated : Feb 20, 2019, 3:39 PM IST