ధర్మాధికారి ఆదేశాలను యథాతథంగా అమలు చేయాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఏపీ ఉద్యోగుల వ్యవహార శైలికి నిరసనగా మింట్ కాంపౌండ్, విద్యుత్ సౌధలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేశారు. గత ఆరేళ్లుగా విద్యుత్ ఉద్యోగులు విభజనకు నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థల్లో మళ్లీ లొల్లి - విద్యుత్ సంస్థల మధ్య మళ్లీ వివాదం
విద్యుత్ ఉద్యోగుల పంపకాలపై తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య మళ్లీ వివాదం మొదలైంది. జస్టిస్ ధర్మాధికారి ఆదేశాలు యథాతథంగా అమలు చేయాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఏపీ విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ ఆర్డర్లను తెలంగాణ ఉద్యోగులు తగులబెట్టారు. ఏపీ ఉద్యోగుల వ్యవహార శైలికి నిరసనగా మింట్ కాంపౌండ్, విద్యుత్ సౌధలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఆంధ్రా ఉద్యోగులు ఎవ్వరికీ కూడా తెలంగాణకు వచ్చే నియమ నిబంధనలు వర్తించవని వారు స్పష్టం చేశారు. దానిని విస్మరించి ఆంధ్రా ఉద్యోగులు కావాలని గొడవలకై తెలంగాణలో చేరేందుకు వస్తున్నట్లు అర్థమవుతుందన్నారు. దానికి నిరసనగా ధర్నా చేస్తున్నామన్నారు. ఏ రాష్ట్రంలో స్థానికత ప్రకారం ఆ రాష్ట్రానికి ఉద్యోగుల కేటాయింపులు చేయాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ ఆర్డర్లను తెలంగాణ ఉద్యోగులు తగులబెట్టారు.
ఇదీ చూడండి :అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు మండలి ఆమోదం