హైదరాబాద్లో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి కమిటీ ప్రధాన కార్యదర్శి ఆచార్య హరగోపాల్ అధ్యక్షత వహించారు. ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నస్తుందని హరగోపాల్ ఆరోపించారు. విద్యా హక్కు చట్టాన్ని సవరించేందుకు పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం.. విద్యా శాఖ ఒక కమిటీ వేయడాన్ని తప్పుపట్టారు.
'విద్యా హక్కు చట్టం నిర్వీర్యం చేస్తున్నారు'
విద్యా హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తుందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆరోపించింది. హైదరాబాద్లో కమిటీ ప్రధాన కార్యదర్శి ఆచార్య హరగోపాల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
'విద్యా హక్కు చట్టం నిర్వీర్యం చేస్తున్నారు'
ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం కిలో మీటర్లోపు ఒక ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల లోపు ఒక ప్రాథమికోన్నత పాఠశాల, ఐదు కిలోమీటర్లలోపు ఒక ఉన్నత పాఠశాలలు ఉన్నాయన్నారు. , ఇప్పుడు ఈ చట్టాన్ని సవరించి ఐదు కిలోమీటర్లలోపు ఒకే పాఠశాలను ఉండే విధంగా చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు.
ఇదీ చదవండిః మొక్కి మరీ చోరీ చేశాడో దొంగ భక్తుడు
TAGGED:
haragopal