తెలంగాణ

telangana

ETV Bharat / state

'బతుకమ్మ'కు ఇందిరా గాంధీకి ఉన్న అనుబంధం.. షేర్ చేసిన ప్రియాంక - Happy Bathukamma to Telangana people Priyanka

Priyanka Gandhi On Bathukamma: రాష్ట్రంలో మూడో రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఊరూవాడల్లో ఉయ్యాల పాటలు మారుమోగుతున్నాయి. ఊరూ వాడా రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి రాగ యుక్తమైన పాటలకు లయబద్దమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడుతున్నారు. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా చౌరస్తాలన్నీ బతుకమ్మలతో మురిసిపోతున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్విటర్​లో పోస్ట్ చేసిన ఇందిరా గాంధీకి సంబంధించిన ఓ చిత్రం వైరల్​గా మారింది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Priyanka Gandhi on Bathukamma
Priyanka Gandhi on Bathukamma

By

Published : Sep 27, 2022, 8:47 PM IST

Priyanka Gandhi On Bathukamma: రాష్ట్రంలో బతుకమ్మ సంబురాలు మూడు రోజు ఘనంగా జరుగుతున్నాయి. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు సంప్రదాయ నృత్యాలతో ఆడిపాడుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకా గాంధీ తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకంగా ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియచేశారు.

అంతేకాకుండా బతుకమ్మ పండుగతో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ అప్పటి ఫొటోను ట్విటర్​లో షేర్‌ చేశారు. 1978లో ఓరుగల్లులో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో తన నానమ్మ ఇందిరా గాంధీ పాల్గొనడం ఒక మధుర స్మృతి అని తెలిపారు. ప్రకృతిని ప్రేమిస్తూ, పువ్వులను పేర్చి ఊరూ వాడా కలిసి చేసుకునే పండుగగా బతుకమ్మను అభివర్ణించారు. ఈ పండుగ రాష్ట్ర ప్రజలకు సంతోషాన్ని కలుగజేయాలని కోరుకుంటున్నట్టు ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details