'రాహుల్ వద్దంటే ఆ పదవి ప్రియాంకా గాంధీకే ఇవ్వాలి' - vh
కాంగ్రెస్ అధికార పగ్గాలు ప్రియాంకా గాంధీ తీసుకుంటేనే పార్టీకి పుర్వ వైభవం వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ మృతికి సంతాపం తెలిపారు.
కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ మరణం పార్టీకి తీరని లోటని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. వారితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాహుల్ గాంధీ రాజీనామా తర్వాత పార్టీలో ఏఐసీసీ అధ్యక్షులు ఎవరన్న అంశంపై తీవ్ర చర్చ జరుగుతోందన్న ఆయన... గాంధీ కుటుంబం తప్ప ఎవరినీ ప్రజలు ఆమోదించబోరని స్పష్టం చేశారు. రాహుల్ వద్దంటే ఆ పదవి ప్రియాంకా గాంధీకి ఇవ్వాలని... అప్పుడే పార్టీకి తిరిగి పూర్వ వైభవం వస్తుందని పేర్కొన్నారు.