తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు రాష్ట్రానికి రానున్న ప్రియాంక గాంధీ - ఇదే ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ - రేపు ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Election Campaign in Telangana Tomorrow : ఆదివారం రాష్ట్రానికి ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. అనంతరం తిరిగి నాందేడ్‌ వెళ్లనున్నారు. ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఇదే.

Priyanka Gandhi Election Campaign
Priyanka Gandhi Election Campaign in Telangana Tomorrow

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2023, 7:17 PM IST

Priyanka Gandhi Election Campaign in Telangana Tomorrow : కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చి పదేళ్లు అయిన ఇంకా అక్కడ అధికారంలోకి రాకపోవడంతో.. ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ నాయకత్వం ఉంది. ఇందులో భాగంగా జాతీయనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ, రేవంత్‌ రెడ్డిలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీల(Congress Six Guarantees)ను ప్రజలల్లోకి.. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఓటర్లలోకి తీసుకొని వెళుతున్నారు. ఈక్రమంలో ఓటర్లను ఆకర్షించడానికి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఆదివారం రాష్ట్రానికి వచ్చి రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ.. ఆదివారం ఖానాపూర్‌, అసిఫాబాద్‌లో ప్రచారం చేయనున్నారు. అదేరోజు నాందేడ్‌ నుంచి హెలికాప్టర్‌లో ఖానాపూర్‌ రానున్న ప్రియాంక గాంధీ.. అక్కడ గంటసేపు ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఆసిఫాబాద్‌ చేరుకోనున్నారు.

ఊపందుకున్న ఎన్నికల ప్రచారాలు, ఓటర్ల అనుగ్రహం కోసం ముమ్మర ప్రయత్నాలు

Congress Election Campaign in Telangana : మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఆసిఫాబాద్‌లో ఎన్నికల ప్రచారం(Telangna Election)లో పాల్గొననున్నారు. నాగోబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్కడినుంచి లంబాడా తండాలో మహిళలతో కలసి కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలపై ప్రచారం చేయనున్నారు. అక్కడే గిరిజన మహిళలతో ప్రత్యేక వంటకాలు చేయడంలో పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే అవకాశం కూడా ఉందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఇక్కడ ప్రచారం ముగియగానే తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ఆసిఫాబాద్‌ నుంచి నాందేడ్‌కు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ వెళ్లనున్నారు.

రాష్ట్రంలో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ :

  • నాందేడ్ నుంచి హెలికాప్టర్‌లో ఖానాపూర్‌ రానున్న ప్రియాంక
  • ఖానాపూర్‌లో గంటసేపు ప్రచార కార్యక్రమం
  • 12 గంటలకు అసిఫాబాద్‌ చేరుకోనున్న ప్రియాంక గాంధీ
  • 12 గంటల నుంచి 1 వరకు అసిఫాబాద్‌లో ఎన్నికల ప్రచారం
  • నాగోబా దేవాలయం సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్న ప్రియాంక
  • అక్కడ నుంచి లంబాడా తండాలో మహిళలతో కలసి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ప్రచారం
  • అక్కడ మహిళలతో కలిసి గిరిజనుల ప్రత్యేక వంటకాలు చేసే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం
  • మహిళలతో కలిసి ఆర్టీసీ బస్‌లో ప్రయాణం చేసే అవకాశం
  • తిరిగి మధ్యాహ్నం 1 గంటకు అసిఫాబాద్ నుంచి నాందేడ్ వెళ్లనున్న ప్రియాంక

Priyanka Gandhi Fires on BRS and BJP : 'బీఆర్ఎస్ ప్రభుత్వ రిమోట్‌ మోదీ చేతిలో ఉంది'

ప్రజాకర్షక హామీలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో - ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి - ధరణి స్థానంలో భూమాత పోర్టల్

ABOUT THE AUTHOR

...view details