భారతదేశ వ్యాప్తంగా 18 లక్షల ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు సేవలందిస్తున్నాయి. వీటిపై ఆధారపడి ప్రత్యక్షంగా కోటి మంది, పరోక్షంగా దాదాపు మూడు కోట్ల మంది జీవిస్తున్నారు. 45 రోజులుగా ప్రభుత్వం లాక్డౌన్ విధించడం వల్ల బస్సులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్రావెల్స్ నడిచినా... నడవకపోయినా... ట్యాక్స్, ఇన్సూరెన్స్ మాత్రం కట్టాల్సిందే.
ప్రైవేట్ ట్రావెల్స్‌కు లాక్డౌన్ కష్టాలు - Private Travels Services
లాక్డౌన్ వల్ల ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వాహనాలకు కట్టే ట్యాక్స్, ఇన్సూరెన్స్ డబ్బులకు సరిపోయే ఆదాయం సైతం లేక అవస్థలు పడుతున్నాయి. ఈ తరుణంలో సర్కారు తమను ఆదుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రైవేట్ ట్రావెల్స్ సలహాదారు బోసు కోరుతున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పక్క ఆదాయం లేక... మరో పక్క పన్ను కట్టలేక యజమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై తెలుగు రాష్ట్రాల ప్రైవేట్ ట్రావెల్స్ సలహాదారు బోసుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇవీ చూడండి:అమ్మా.. నీ మనసు వెన్న...