లాక్డౌన్ కాలంలో తమ వాహనాలను నడపనందుకు క్వార్టర్లీ ట్యాక్స్‌ను మినహాయించాలని కోరుతూ ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు ఖైరతాబాద్‌లోని కేంద్ర రవాణాశాఖ కార్యాలయానికి తరలివచ్చారు. వాహనాలు నడవకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు వివరించేందుకు వచ్చామని వారు తెలిపారు. ఇప్పటికే డ్రైవర్లు, క్లీనర్ల జీతాలు చెల్లించే పరిస్థితుల్లో లేమని... దీనికి తోడు వాహనాల కిస్తీలు కట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
లాక్డౌన్ సమయంలో ఉన్న ట్యాక్స్ ను మినహాయిస్తే... తమకు ఆర్థికంగా కొంత వెసులుబాటు అవుతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కమిషనర్‌కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.