తెలంగాణ

telangana

ETV Bharat / state

అమరవీరుల స్తూపం ముందు అధ్యాపకుల ఆందోళన - ప్రైవేటు అధ్యాపకుల ఆందోళన

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపును నిరసిస్తూ ప్రైవేటు అధ్యాపకులు హైదరాబాద్​ గన్​పార్క్ వద్ద ఆందోళన నిర్వహించారు. విద్యాసంస్థల మూసివేతతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు.

private teachers protest, gunpark hyderabad
అమరవీరుల స్తూపం ముందు అధ్యాపకుల ఆందోళన

By

Published : Mar 27, 2021, 4:53 PM IST

ప్రైవేటు అధ్యాపకుల సమస్యలు, విద్యాసంస్థల మూసివేత, వయోపరిమితి పెంపుపై హైదరాబాద్​లో నిరసన చేపట్టారు. రాష్ట్ర సాంకేతిక విద్యా కళాశాలల అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో.. గన్​పార్క్ అమరవీరుల స్తూపం ముందు ఆందోళన జరిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నిరుద్యోగి భృతి ఇవ్వాలని... మూసివేసిన విద్యా సంస్థలను తెరిపించి... తొలిగించిన అధ్యాపకులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. యాజమాన్యాలు విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేస్తూ... అధ్యాపకులకు వేతనాలు చెల్లించడం లేదన్నారు. కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి :గిరిజన మహిళలపై ఫారెస్ట్ సిబ్బంది దాష్టీకం

ABOUT THE AUTHOR

...view details