తెలంగాణ

telangana

ETV Bharat / state

డీఈవో కార్యాలయం ఎదుట ప్రైవేట్ ఉపాధ్యాయుల నిరసన - private teachers protest to pay full salaries in telangana

హైదరాబాద్​ బషీర్​బాగ్​లోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట తెలంగాణ ప్రైవేట్ టీచర్ల ఫోరం ఆందోళనకు దిగింది. సెప్టెంబరు 5 (ఉపాధ్యాయుల దినోత్సవం)ను బ్లాక్​ డేగా ప్రకటించిన ప్రైవేట్ ఉపాధ్యాయులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

private teachers protest on teachers day
డీఈవో కార్యాలయం ఎదుట ప్రైవేట్ ఉపాధ్యాయుల నిరసన

By

Published : Sep 5, 2020, 4:16 PM IST

ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా హైదరాబాద్ బషీర్​బాగ్​లోని డీఈవో కార్యాలయం ఎదుట నల్లజెండాలు, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సెప్టెంబరు 5 (ఉపాధ్యాయుల దినోత్సవం)ను బ్లాక్​ డేగా ప్రకటించి... తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వం గుర్తింపు కార్డులను ఇవ్వాలని.. జీవో నెంబర్​ 45 ప్రకారం ప్రైవేటు టీచర్లకు, నాన్​టీచింగ్ సిబ్బందికి యాజమాన్యాలు పూర్తి వేతనం చెల్లించాలని కోరారు.ప్రైవేట్ ఉపాధ్యాయుల కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని... ప్రైవేటు విద్యా సంస్థలను నియంత్రించడానికి ప్రభుత్వం ఒక రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేయాలని... ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details