హైదరాబాద్ మాదాపూర్లో ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. అతివేగంతో మలుపు వద్ద బస్సును తిప్పడం వల్లే అదుపు తప్పి బోల్తా పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
మాదాపూర్లో పాఠశాల బస్సు బోల్తా - private school bus accident at hyderabad
హైదరాబాద్ మాదాపూర్లో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. అందులో విద్యార్థులెవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది.
మాదాపూర్లో పాఠశాల బస్సు బోల్తా
ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. బస్సుకు ఫిట్నెస్ లోపాలున్నాయా లేదా డ్రైవర్ మద్యం సేవించి నడుపుతున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చూడండి : బెల్టుతో చితకబాదిన వీడియో వైరల్.. నిందితుల అరెస్టు