కరోనా నేపథ్యంలో 50 శాతం పడకలను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమానులతో మంత్రి ఈటల సమావేశం నిర్వహించారు. భేటీలో కార్పొరేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ డాక్టర్ శ్రీనివాస్, నిపుణుల కమిటీ సభ్యులు కాళోజి యూనివర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.
సగం పడకలు ఇవ్వడానికి ప్రైవేటు ఆస్పత్రులు అంగీకారం - minister eetala rajendar latest news
రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు 50 శాతం పడకలను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు ప్రకటించాయి. ప్రభుత్వానికి ప్రతి ఆస్పత్రిలో ఒప్పందం మేరకు పడకలను ఇవ్వనున్నారు. ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్‌తో జరిగిన సమావేశంలో నిర్ణయించారు.
ప్రభుత్వానికి ప్రతి ఆస్పత్రిలో 50 శాతం పడకలు ఇవ్వడానికి ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులు అంగీకరించారు. ఈ నేపథ్యంలో మంత్రి వారికి అభినందనలు తెలిపారు. కరోనా సమయంలో వైద్యాన్ని వ్యాపారంగా చూడవద్దన్న ఈటల... ప్రత్యేక యాప్ ద్వారా ప్రైవేట్‌లో అందుబాటులో ఉన్న 50% పడకలను ప్రజలకు అందించనునట్టు వెల్లడించారు. ఆయా పడకల్లో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే వైద్యం అందించాలన్న ఈటల... కార్పొరేట్లో అధిక ఫీజుల వసూళ్లను నియంత్రించాలని యాజమాన్యాలను ఆదేశించారు.
ఇదీ చూడండి :ఆగస్టు 15న 10,500 ప్రజా మరుగుదొడ్లు ప్రారంభం: సీఎస్