కరోనా సమయంలో ప్రైవేట్ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 45ను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రైవేట్ సాంకేతిక కళాశాల ఉద్యోగ సంఘం డిమాండ్ చేసింది. ప్రైవేట్ సాంకేతిక కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకుల సమస్యలను పరిష్కారిచాలంటూ... తెలంగాణ స్కూల్, టెక్నికల్ కళాశాల ఉద్యోగుల సంఘం నిరసన వ్యక్తం చేసింది.
'తొలగించిన అధ్యాపకులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి' - జేఎన్టీయూహెచ్ వార్తలు
తెలంగాణ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ ఉద్యోగులకు.. ఉద్యోగ భధ్రత కల్పించాలని కోరుతూ... రాష్ట్ర ప్రైవేట్ సాంకేతిక కళాశాల ఉద్యోగ సంఘం డిమాండ్ చేసింది. కరోనా సమయంలో విధుల నుంచి తొలగించిన ఉద్యోగులను వెంటే విధులలోకి తీసుకోవాలని వారు కోరారు.

'తొలగించిన అధ్యాపకులను వెంటనే విధులలోకి తీసుకోవాలి'
'తొలగించిన అధ్యాపకులను వెంటనే విధులలోకి తీసుకోవాలి'
ఆరు నెలలుగా ప్రైవేట్ కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులకు జీతాలు చెల్లించడం లేదని తెలంగాణ ప్రైవేట్ సాంకేతిక కళాశాల ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సంతోష్‌కుమార్ ఆరోపించారు. తొలగించిన అధ్యాపకులను వెంటనే విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు 6 నెలల వేతనంతో కూడిన మెటర్నటీ సెలవులు ఇవ్వాలని కోరారు. తెలంగాణ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:'సర్వేలతో కాలయాపన చేయకుండా.. ఆదుకోండి'