ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఈడ్పుగల్లు కోవిడ్ సెంటర్ నుంచి ఓ హత్యకేసులోని ముద్దాయి పరారయ్యాడు. నిందితుడు విజయవాడ సబ్ జైల్లో రిమాండ్లో ఖైదీగా ఉన్నాడు. కరోనా పాజిటివ్ రావటం వల్ల ఈడ్పుగల్లు కోవిడ్ సెంటర్కు తరలించగా పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.
కరోనా ఐసొలేషన్ వార్డు నుంచి ఖైదీ పరారీ - Prisoner escapes from corona isolation ward
ఏపీ విజయవాడ ఈడ్పుగల్లు కోవిడ్ సెంటర్ నుంచి ఓ హత్యకేసులోని ముద్దాయి పరారయ్యాడు. నిందితుడు విజయవాడ సబ్ జైల్లో రిమాండ్లో ఖైదీగా ఉన్నాడు.
కరోనా ఐసొలేషన్ వార్డు నుంచి ఖైదీ పరారీ
నిందితుడు కరోనా బాధితుడు కావడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు ఆచూకీ తెలిస్తే తమకు తెలపాలని పోలీసులు కోరారు.
ఇదీ చూడండి :పరిశ్రమల్లో అత్యధిక ఉద్యోగాలు స్థానికులకే..