ఏపీ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలోనూ కరోనా విజృంభిస్తోంది. ఖైదీలకు వేగంగా వైరస్ సోకుతోంది. కరోనా పాజిటివ్ ఉన్న ఖైదీ గతరాత్రి గుండెపోటుతో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. అక్కడ సుమారు 1700 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో 900 మందికి పరీక్షలు చేశారు.
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో కరోనాతో ఖైదీ మృతి - Corona at Rajanmahendravaram news
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలోనూ కరోనా వేగంగా విస్తరిస్తోంది. కోవిడ్ నిర్ధరణ అయిన ఓ ఖైదీ జైలులోనే మరణించాడు.

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో కరోనాతో ఖైదీ మృతి
ఇప్పటివరకు 50మందికి పైగానే ఖైదీలకు కరోనా సోకింది. సిబ్బందికి కూడా అధిక సంఖ్యలో పాజిటివ్ నిర్ధరణ అయింది. ఇంకా పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత కేంద్ర కారాగారంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. దీంతో జైలులో అధికారులు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి:కొత్త సచివాలయ పనులు అక్టోబర్‌లో ప్రారంభించే అవకాశం