కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ కోసం గాంధీ ఆస్పత్రి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న గాంధీ సిబ్బందితో ప్రధాని మోదీ ... దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు. ఇందుకోసం అసుపత్రిలో భారీ డిజిటల్ తెరలను ఏర్పాటు చేశారు.
'పారిశుద్ధ్య సిబ్బంది సేవలు భేష్... టీకాలో వారికే ప్రాధాన్యం' - corona vaccine gandhi hospital
గాంధీ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం సర్వం సిద్ధం చేశామని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. వైద్యసిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వటంపై నెలకొన్న అపోహలన్నింటిని ఇప్పటికే నివృత్తి చేసినట్లు పేర్కొన్నారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య సిబ్బంది అందించిన సేవలు అద్వితీయమన్నారు. వ్యాక్సినేషన్‌లో వారికే అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు.
gandhi superintendent
వ్యాక్సిన్ కారణంగా ఎవరికైనా రియాక్షన్స్ వస్తే చికిత్స అందించేందుకు వీలుగా 12 పడకల ఐసీయూని సిద్ధం చేశారు. వ్యాక్సిన్ ప్రక్రియ కోసం గాంధీ ఆసుపత్రి సన్నద్ధతపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
ఇదీ చదవండి :'వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం.. కానీ వారికి ఇవ్వట్లేదు'