MODI HYDERABAD TOUR: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ముగిసింది. ఆదివారం పరేడ్ మైదానంలో విజయ సంకల్ప సభ అనంతరం రాజ్‌భవన్‌లో రాత్రి బస చేసిన ప్రధాని.. ఉదయం రాజ్‌భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా బేగంపేట విమానాశ్రయానికి వెళ్లారు. 9.25 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు బయల్దేరారు. ప్రత్యేక విమానంలో ఇక్కడి నుంచి పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గన్నవరం విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలకనున్నారు.
రాష్ట్రంలో ముగిసిన ప్రధాని మోదీ పర్యటన - Modi telangana tour latest updates
MODI HYDERABAD TOUR: రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ముగిసింది. బేగంపేట విమానాశ్రయం వద్ద గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని, భాజపా నేతలు మోదీకి వీడ్కోలు పలికారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో మోదీ విజయవాడకు వెళ్లారు.
![రాష్ట్రంలో ముగిసిన ప్రధాని మోదీ పర్యటన రాష్ట్రంలో ముగిసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15730324-327-15730324-1656909037344.jpg)
రాష్ట్రంలో ముగిసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన
అంతకుముందు గవర్నర్ తమిళి సై, ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు భాజపా నేతలు ప్రధాని మోదీకి వీడ్కోలు పలికారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బేగంపేట విమానాశ్రయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్ నుంచి బేగంపేట వరకు వాహనాలను నిలువరించారు. ప్రధాని బేగంపేటకు చేరుకున్న అనంతరం రాకపోకలను పునరుద్ధరించారు.