PM Hyderabad Tour Today: ప్రధాని నరేంద్రమోదీ నేడు హైదరాబాద్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు. తిరుపతికి వెళ్లే భక్తుల ప్రయాణ సమయం దాదాపు మూడున్నర గంటలు తగ్గనుంది. సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు ద్వారా వందే భారత్ రైలు తిరుపతికి వెళ్లనుందని రైల్వే అధికారులు తెలిపారు. హాల్టింగ్ మాత్రం సికింద్రాబాద్, నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో మాత్రమే ఉండనుంది.
PM Narendra Modi Will Visit Hyderabad Today: హైదరాబాద్ సబర్బన్ విభాగంలో 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రధాని ప్రారంభించనున్నారు. జంట నగరాల్లోని ప్రయాణికులకు వేగం, సురక్షితం, చౌక, సౌకర్యవంతమైన ప్రయాణం అందనుంది. ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టులో భాగంగా సికింద్రాబాద్-మేడ్చల్ మార్గంలో 28 కిలోమీటర్ల మేర కొత్త సబర్బన్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. లాలాగూడ గేట్, మాల్కాజ్‌గిరి, సఫిల్‌గూడ, ఆర్కేపురం, అల్వాల్, బొల్లారం బజార్, గుండ్లపోచంపల్లి, గౌడవల్లి, శివరాంపల్లి, బుద్వేల్ స్టేషన్లు వినియోగంలోకి రానున్నాయి. సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్ విద్యుదీకరణనూ ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు.