PM Modi Public Meeting In Warangal : ఓరుగల్లులో నేడు ప్రధాని నరేంద్ర మోదీపర్యటనకు సర్వం సిద్ధమైంది. మూడు దశాబ్దాల తరవాత మరోసారి ప్రధాని ఏకశిలానగరానికి వస్తున్నారు. వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ హకీంపేటకు 9 గంటల 25 నిమిషాలకు మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 10 గంటల 15 నిమిషాలకు వరంగల్‌లోని మామునూరు ఏరోడ్రమ్‌కు చేరుకుంటారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని మోదీ దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.
PM Modi Visits Telangana : 11 గంటల 40 నిమిషాలకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకుని.. వర్చువల్ విధానంలో రూ.521 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కాజీపేట వ్యాగన్ తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. రూ.2 ,147 కోట్ల వ్యయంతో.. జగిత్యాల-కరీంనగర్-వరంగల్ ఇంటర్ కారిడార్‌కు, రూ.3,441 కోట్ల వ్యయంతో ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మైదానంలో విజయ్ సంకల్ప బహిరంగసభలో పాల్గొంటారు.
Warangal PM Modi Public Meeting Today :మోదీ పర్యటన కోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అధికారిక కార్యక్రమాలు,బహిరంగ సభకు వేర్వేరు వేదికలను ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, నితిన్ గడ్కరీ, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ముఖ్య నేతలంతా సభకు హాజరవుతున్నారు. మోదీ పర్యటన ఓ చారిత్రాత్మక ఘట్టమని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డిఅభివర్ణించారు.
Narendra Modi Warangal Public Meeting Today :తొలిసారిగా ఓరుగల్లుకు వస్తున్న ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు.. కమలం సేన సర్వ సన్నద్ధమైంది. నియోజకవర్గాల వారీగా ఇప్పటికే ఆ పార్టీ.. సన్నాహక సమావేశాలు నిర్వహించి.. శ్రేణులను సమాయత్తం చేసింది. నగరంలో మోదీకి స్వాగతం పలుకుతూ.. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.