తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి: ప్రధాని మోదీ - modi speech

జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్​నుద్దేశించి మోదీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సందేశమిచ్చారు. శిక్షణా ఐపీఎస్​లకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. కొవిడ్​ వేళ పోలీసుల సేవలు చరిత్రలో లిఖించాలని పేర్కొన్నారు. ఖాకీ దుస్తులు ధరించినందుకు గర్వపడాలని సూచించారు.

modi speech
modi speech

By

Published : Sep 4, 2020, 12:03 PM IST

Updated : Sep 4, 2020, 12:26 PM IST

వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మోదీ సందేశం

యోగా, ప్రాణాయామం.. ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మనసులోనూ యోగా చేయడం చాలా మంచి పద్ధతి అని తెలిపారు. జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్​నుద్దేశించి వర్చువల్ లైవ్ ద్వారా మోదీ మాట్లాడారు. ఈ వీడియోకాన్ఫరెన్స్​లో అమిత్‌షా, జితేంద్రసింగ్‌, కిషన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఐపీఎస్ ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రధాని మోదీ స్ఫూర్తిదాయక సందేశమిచ్చారు.

కరోనా సంకట పరిస్థితుల్లో పోలీసుల సేవలు ప్రశంసనీయమని ప్రధాని కొనియాడారు. కరోనా కట్టడిలో పోలీసులు ముందుండి పోరాడుతున్నారని ప్రశంసించారు. కరోనా వేళ మానవతా దృక్పథంతో పోలీసులు సేవలందిస్తున్నారని చెప్పారు. ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలని ప్రధాని మోదీ అన్నారు.

ఐపీఎస్ ప్రొబేషనర్లను గతంలో ఇంటికి ఆహ్వానించానని ప్రధాని గుర్తు చేశారు. కొవిడ్ కారణంగా ప్రస్తుతం ముఖాముఖిగా కలుసుకోలేకపోతున్నామని తెలిపారు. కరోనా తగ్గాక త్వరలోనే ఐపీఎస్ ప్రొబేషనర్లతో సమావేశమవుతానని పేర్కొన్నారు.

ప్రజా సేవలో ఉండే అధికారులు ఆరోగ్యంగా ఉండాలి. పనిభారం, ఒత్తిడి ప్రభావం ఆరోగ్యంపై పడకుండా చిట్కాలు పాటించాలి. పనిచేసే చోట ఉపాధ్యాయులు, నిపుణులతో నెలకోసారైనా భేటీ కావాలి. కరోనా కష్టకాలంలో ఖాకీల మానవీయ కోణం ప్రజలకు తెలిసింది. కరోనా సమయంలో పోలీసుల పాత్రను చరిత్రలో లిఖించాలి. ఖాకీ దుస్తులు వేసుకున్నందుకు గర్వపడాలే తప్ప అహంభావం ఉండకూడదు. - మోదీ, ప్రధాని

ఇదీ చదవండి:పరిమితి సమయాల్లోనే హైదరాబాద్ మెట్రో సేవలు

Last Updated : Sep 4, 2020, 12:26 PM IST

ABOUT THE AUTHOR

...view details