హైదరాబాద్ హబ్సిగూడ ప్రధాన రహదారిపై విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు హిందూ స్వయం సంకల్పం సేవా సంస్థ ప్రతినిధులు మాస్కులు, శానిటైజర్లు, వాటర్ బాటిళ్లు అందజేశారు.
సమాజ సేవకు మేము సైతం అంటోన్న పురోహితులు - LOCK DOWN EFFECTS
సమాజ సేవకు తాము సైతం అంటూ పురోహితులు ముందుకొచ్చారు. నిరంతరం విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు అందించారు. నిత్యం 2500 మందికి భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.
![సమాజ సేవకు మేము సైతం అంటోన్న పురోహితులు PRIEST DISTRIBUTED FOOD AND MASK TO POLICE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6858089-126-6858089-1587303521323.jpg)
సమాజ సేవకు మేము సైతం అంటోన్న పురోహితులు
సంస్థ తరఫున ప్రతిరోజు 2500 మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నట్టు, ఎనిమిది వేలకు పైగా వాటర్ బాటిళ్లు, ఐదు వేలకు పైగా మాస్కులు అందజేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. కరోనా వైరస్ను తరిమికొట్టే వరకు ప్రతీ ఒక్కరు ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచించారు.