గర్భాశయ క్యాన్సర్ నివారణకు వాటిని గుర్తించేందుకు పరీక్షలు చేసుకునేలా మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. 'గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన-భారత్ రోడ్ మ్యాప్' అంశంపై దిల్లీలోని సప్ధర్ జంగ్ ఆస్పత్రి, వర్ధమాన్ మెడికల్ కాలేజీ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో గవర్నర్ పాల్గొన్నారు.
GOVERNOR: ముందస్తుగా గుర్తించడంతోనే గర్భాశయ క్యాన్సర్ నివారణ సాధ్యం - governor tamilisy latest news
ముందస్తుగా గుర్తించడం వల్లే గర్భాశయ క్యాన్సర్‌ను నివారించగలమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం కింద క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు. 'గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన-భారత్ రోడ్ మ్యాప్' అంశంపై నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
దేశంలో గర్భాశయ క్యాన్సర్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏటా 60 వేల మంది మహిళలు క్యాన్సర్‌తో చనిపోవడం బాధాకరమన్నారు. నివారణకు పరీక్షా కేంద్రాలను ఎక్కువగా ఏర్పాటు చేసి పరీక్షలు చేయించుకునేలా మహిళలకు అవగాహన కల్పించాలని తమిళిసై అభిప్రాయం వ్యక్తం చేశారు. ముందస్తుగా గుర్తించడంతో నివారణ సాధ్యమన్న గవర్నర్.. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం కింద క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: Cm Kcr: ఎస్సీల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదు: సీఎం