తెలంగాణ

telangana

ETV Bharat / state

'ముందే గుర్తిస్తే క్యాన్సర్ నివారణ సాధ్యమే'

అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో క్యాన్సర్ నివారణ సాధ్యమేనంటున్నారు నిపుణులు. ప్రస్తుతం చాలా రకాల వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయని, వ్యాధి పూర్తిగా ముదరక ముందే వస్తే.. ఈ సమస్య లేదని వైద్యులు భరోసా ఇస్తున్నారు.

By

Published : Feb 5, 2020, 10:47 PM IST

cancer
cancer

హైదరాబాద్‌ సింగరేణి భవన్​లో క్యాన్సర్‌ డే’’ సందర్భంగా ‘క్యా‘న్సర్‌-వ్యాధి-నివారణ’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఇందులో క్యాన్సర్​లో వివిధ రకాల వ్యాధులు, నివారణపై ఫోటో, వీడియో ప్రదర్శనల ద్వారా ప్రముఖ అంకాలజిస్టు డాక్టర్‌ జి.విశ్లేష్‌ వివరించారు. గతంలోలాగా క్యాన్సర్‌ వ్యాధి వస్తే ఇక మరణమే అనే అపోహకు ఇప్పుడు తావు లేదనీ, ‘‘కీమోథెరపీ’వ వంటి క్లిష్టతరమైన పద్ధతి నుంచి.. నేడు నిర్దిష్టంగా క్యాన్సర్‌ కణాలను మాత్రమే సంహరించే అత్యాధునిక చికిత్సా పద్ధతులు, మందులు అందుబాటులోకి వచ్చాయన్నారు.

రాష్ట్రంలో ప్రధానంగా మహిళల్లో రొమ్ము, మూత్రాశయ క్యాన్సర్లు, మగవాళ్లలో పొగాకు, గుట్కా వాడకం వల్ల నోటి క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయనీ, ఇది పూర్తిగా నివారించదగినవేనని తెలిపారు. మంచి ఆరోగ్య సూత్రాలు పాటించడం, మంచి ఆహారం, పండ్లు వంటివి తీసుకోవడం చేస్తే చాలా వరకు వాటిని నివారించవచ్చని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details