తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలాజీ హెచరీస్‍ సంస్థకు ప్రతిష్ఠాత్మక హెచ్​వైఎం క్వాలిటీ అవార్డు.. - ఏపీ తాజా వార్తలు

Award for Balaji Hatcheries: నాణ్యతా ప్రమాణాలతో ఉత్తమమైన సేవలందించడం ద్వారా దివంగత డాక్టర్‌ సుందరనాయుడు స్ధాపించిన బాలాజీ హెచరీస్‍ సంస్థ ప్రతిష్ఠాత్మకమైన హెచ్​వైఎం క్వాలిటీ అవార్డు సొంతం చేసుకుంది. బాలాజీ హెచరీస్‌తో పాటు అపోలో వైద్య సంస్థలు, మెగా ఇంజినీరింగ్ సంస్థ, తాపేశ్వరం కాజా, దక్షిణ మధ్య రైల్వే వంటి 17 సంస్థలు.. అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఇదే కార్యక్రమంలో తితిదే జేఈవో సదాభార్గవికి హెచ్​వైఎం సంస్థ.. లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ప్రదానం చేసింది.

Award for Balaji Hatcheries
Award for Balaji Hatcheries

By

Published : Oct 22, 2022, 4:29 PM IST

Award for Balaji Hatcheries: నాణ్యతా ప్రమాణాలతో ఉత్తమమైన సేవలందించడం ద్వారా దివంగత డాక్టర్‍ సుందరనాయుడు స్ధాపించిన బాలాజీ హెచరీస్‍ సంస్ధ ప్రతిష్ఠాత్మకమైన హెచ్‍వైఎమ్‍ క్వాలిటీ అవార్డు సొంతం చేసుకుంది. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో హెచ్‍వైఎమ్‍ ఇంటర్నేషనల్‍ సర్టిఫికేట్‍ ప్రైవేట్‍ లిమిటెడ్‍ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో తితిదే జేఈవో సదాభార్గవి అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ హెచరీస్​తో పాటు అపోలో వైద్య సంస్థలు, మెగా ఇంజినీరింగ్ సంస్థ, తాపేశ్వరం కాజా, దక్షిణ మధ్య రైల్వే వంటి 17 సంస్థలు అవార్డులను సొంతం చేసుకున్నాయి.

Award for Balaji Hatcheries

నాణ్యమైన సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా హెచ్‍వైఎమ్‍ క్వాలిటీ అవార్డు రావడం అనందంగా ఉందని సుందరనాయుడు మనవడు, బాలాజీ హెచరీస్‍ ఎండీ ప్రణీత్‍ అన్నారు. రైతులకు మెరుగైన ఆదాయం కల్పించే లక్ష్యంతో బాలాజీ హెచరీస్‍ సంస్థ ద్వారా సుందరనాయుడు నిరంతరం శ్రమించారని ప్రణీత్‍ తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన అవార్డు దక్కిన సమయంలో ఆయన తమ మధ్య లేకపొవడం తీరని లోటన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడంలో ఇలాంటి అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయన్నారు.

సుందరనాయుడు ఏర్పాటు చేసిన సంస్థకు అవార్డు దక్కడం ఆనందంగా ఉందని ఆయన కూతురు నీరజ అన్నారు. మరింత బాధ్యతగా బాలాజీ హెచరీస్‍ ద్వారా నాణ్యమైన సేవలందిస్తామన్నారు. హెచ్‍వైఎమ్‍ సంస్థ.. తితిదే జేఈవో సదాభార్గవికి లైఫ్​టైమ్‍ అచీవ్​మెంట్‍ అవార్డు ప్రదానం చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details