కరోనా వైరస్ వల్ల ఐటీ కారిడార్‌ను ఖాళీ చేయిస్తున్నారనే వదంతులను నమ్మవద్దన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. కరోనా సోకినట్లు అనుమానిస్తున్న వ్యక్తికి వ్యాధి ఇంకా నిర్ధరణ కాలేదని స్పష్టం చేశారు. అనవసరంగా పుకార్లు సృష్టించవద్దని కోరారు.
'కరోనాపై పుకార్లు సృష్టిస్తే చర్యలు తప్పవు' - కరోనాపై పుకార్లు నమ్మోద్దన్న సైబరాబాద్ సీపీ
కరోనా వైరస్‌పై సైబరాబాద్ కమిషనరేట్‌లో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. కొవిడ్‌పై వచ్చే పుకార్లలో నిజం లేదని తెలిపారు.
'కరోనాపై వదంతులను నమ్మోద్దు'
వదంతులను వ్యాప్తి చేస్తున్నవారిపై నిఘా పెట్టినట్లు సజ్జనార్ తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:ఆరు నిమిషాల ఆలస్యం.. మొదటి పరీక్షకు దూరం
Last Updated : Mar 4, 2020, 7:29 PM IST