తెలంగాణ

telangana

ETV Bharat / state

'అప్పటి వరకు అమరావతే ఏపీ రాజధాని' - ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని

KOMMINENI SRINIVASA RAO : ఏపీలో మూడు రాజధానులపై ఆ రాష్ట్ర ప్రెస్​ అకాడమీ ఛైర్మన్​ కొమ్మినేని శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెంలోని సరస్వతి నికేతనం గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు.

'అప్పటి వరకు అమరావతే ఏపీ రాజధాని'
'అప్పటి వరకు అమరావతే ఏపీ రాజధాని'

By

Published : Jan 28, 2023, 9:28 PM IST

Updated : Jan 28, 2023, 10:44 PM IST

KOMMINENI SRINIVASA RAO : ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందే వరకు అమరావతే రాజధాని అని.. ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. అందులో మరో మాటకు తావులేదన్నారు. ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి జగన్‌ విఫలమయ్యారన్న విలేకరుల ప్రశ్నకు.. కేంద్రానికి విన్నవిస్తూనే ఉన్నారని చెప్పారు. ఒకప్పుడు ప్రముఖులు, మంత్రులు పర్యటనలకు వస్తే.. జర్నలిస్ట్​లు రాష్టంలోని సమస్యలు అడిగేవారని, ఇప్పుడు వారి వ్యక్తిగత సమస్యలు అడుగుతున్నారన్నారు. ఇప్పుడు సెల్‌ఫోన్ ఉన్న వాళ్లంతా జర్నలిస్టులు అయిపోతున్నారని.. ఒకప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. బాపట్ల జిల్లా వేటపాలెంలోని సరస్వతి నికేతనం గ్రంథాలయాన్ని కొమ్మినేని సందర్శించారు.

ఇవీ చదవండి..:

Last Updated : Jan 28, 2023, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details