రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము తెలంగాణ పర్యటన వాయిదా - Draupadi Murmu latest news
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. సమయాభావం వల్ల రాలేకపోతున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము పర్యటన వాయిదా
భాజపా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర మేధావులతో నేడు ఆమె సమావేశం కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న ద్రౌపది ముర్ము... సమయాభావం వల్ల నేడు హైదరాబాద్ రాలేకపోతున్నారు.