Draupadi Murmu AP Tour: రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన.. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఘనస్వాగతం లభించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆమెకు.. విజయసాయిరెడ్డి సహా పలువురు వైకాపా ఎంపీలు, భాజపా నేతలు సోము వీర్రాజు, సీఎం రమేశ్ తదితరులు స్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయ కళాకారుల నృత్యాలతో ఆహ్వానించారు.
అడగకముందే మద్దతిచ్చారు.. వైకాపాకు ముర్ము కృతజ్ఞతలు - Draupadi Murmu visit to andhrapradesh
Draupadi Murmu ap tour: రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము వైకాపా ప్రజా ప్రతినిధులను కోరారు. తాను అడగకముందే జగన్ మద్దతిచ్చారంటూ.. ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక న్యాయంలో భాగంగా ముర్ముకు ఓటేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు జగన్ నిర్దేశించారు.
అనంతరం రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ముర్ముకు జగన్ దంపతులు స్వాగతం పలికారు. అక్కడ తేనీటి విందు అనంతరం..అంతా కలిసి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లారు. వైకాపా ప్రజాప్రతినిధులకు ముర్మును సీఎం జగన్ పరిచయం చేశారు. ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని.. వైకాపా ప్రజా ప్రతినిధులను ముర్ము కోరారు. ఆంధ్రప్రదేశ్ విశిష్టతలను కొనియాడిన ముర్ము.. రాష్ట్రంలోని కవులు, కళాకారులు, స్వాతంత్య్ర సమరయోధుల గొప్పతనాన్ని ప్రశంసించారు. సామాజిక న్యాయంలో భాగంగా ముర్ముకు ఓటేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు జగన్ నిర్దేశించారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో వైకాపా ప్రజాప్రతినిధులెవరూ గైర్హాజరవకుండా విప్‌లు బాధ్యత తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నిర్దేశించగా.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.