తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు హైదరాబాద్​కు రాష్ట్రపతి.. సిద్ధమైన బొల్లారం... - రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ పర్యటన

హైదరాబాద్​ బొల్లారం రాష్ట్రపతి నిలయం పరిసరాలు ముస్తాబయ్యాయి. రామ్​నాథ్​ కోవింద్​ శీతకాల విడిది కోసం ఈ నెల 20న రాష్ట్రానికి రానున్నారు. 9రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన సాగనుంది.

సిద్ధమైన బొల్లారం...
రేపు హైదరాబాద్​కు రాష్ట్రపతి..

By

Published : Dec 19, 2019, 8:24 PM IST

Updated : Dec 19, 2019, 8:47 PM IST

రేపు హైదరాబాద్​కు రాష్ట్రపతి.. సిద్ధమైన బొల్లారం...
రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఈనెల 28 వరకు తొమ్మిది రోజుల పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రత ఏర్పాట్లను సీపీ అంజనీకుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. నార్త్​ జోన్ డీసీపీ కమలేశ్వర్, బేగంపేట్ ఏసీపీ, బొల్లారం పోలీసులు, కేంద్ర బలగాలు భద్రతలో పాల్గొంటాయి.

ఇప్పటికే జీహెచ్ఎంసీ, పోలీస్, ట్రాఫిక్, సానిటేషన్, ఎలక్ట్రిసిటీ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి నిలయం పరిసరాలు బారికేడ్లు, పూల మొక్కలు, అలంకరణలతో ముస్తాబయ్యాయి. తొమ్మిది రోజుల విడిదిలో రాష్ట్రపతి మధ్యలో కేరళ వెళ్లనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కూడా ఏర్పాట్ల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

డిసెంబర్​ 22న గవర్నర్... రాష్ట్రపతి గౌరవార్థం రాజ్ భవన్​లో విందు ఏర్పాటు చేశారు. శీతాకాల విడిది అనంతరం ఈనెల 28 మధ్యాహ్నం... రామ్​నాథ్ కోవింద్ దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ఈ పర్యటన నేపథ్యంలో రాష్ట్రపతి నిలయం వద్ద తొమ్మిది రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

ఇవీ చూడండి: జనవరి 1 నుంచి కార్గో సేవలు అందించనున్న ఆర్టీసీ

Last Updated : Dec 19, 2019, 8:47 PM IST

ABOUT THE AUTHOR

...view details