President Draupadi Murmu Visited Hyderabad for Winter Retreat : శీతకాలవిడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న దేశాధిపతికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) స్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.
నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి - ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
అనంతరం బేగంపేట విమానశ్రయం నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయానికి ముర్ము పయనమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. 23న తిరిగి దిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS Shanti kumari) సచివాలయంలో వివిధ శాఖలఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి నిలయాన్ని శత్రు దుర్భేధ్యంగా తీర్చిదిద్దారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలోని ఆరు భవనాలు, వెలుపల 14 భవనాలను, చుట్టూ ఉన్న ఉద్యానవనాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
President Draupadi Murmu Welcomed by Governor :రాష్ట్రపతి పర్యటన నిమిత్తం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరోగ్యం, రోడ్లు భవనాలు, మున్సిపల్, విద్యుత్, సంబంధిత శాఖలు కూడా బ్లూ బుక్ ప్రకారం ఏర్పాటు చేయాలని గతంలోనే సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.