తెలంగాణ

telangana

ETV Bharat / state

శీతాకాల విడిది కోసం బొల్లారం నివాసానికి రేపు రాష్ట్రపతి రాక - ఆ మార్గాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు

President Draupadi Murmu Telangana Tour Traffic Restrictions : శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రేపు ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.

President Draupadi Murmu
President Draupadi Murmu Telangana Tour Traffic Restrictions

By ETV Bharat Telangana Team

Published : Dec 17, 2023, 8:03 PM IST

President Draupadi Murmu Telangana Tour Traffic Restrictions : ప్రతి శీతాకాలానికి భారత రాష్ట్రపతి హైదరాబాద్​ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి(Rashtrapati Nilayam) విడిది చేయడానికి వస్తుంటారు. ఈ క్రమంలోనే సోమవారం హైదరాబాద్​కు దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము(India President) రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లోని పలు చోట్ల ట్రాఫిక్​ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.

సోమవారం(రేపు) సాయంత్రం 6.25 గంటలకు రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి 7 గంటలకు ప్రవేశించి సేద తీరి, కొన్ని రోజులు ఇక్కడే ఉండనున్నారు. బొల్లారం నిలయానికి వెళ్లే మార్గాల్లో రాష్ట్రపతి కాన్వాయ్​కు సంబంధించి అధికారులు శనివారం రిహార్సల్ కూడా చేశారు. ఈ ఏర్పాట్లు మొత్తాన్ని సైబరాబాద్​ సీపీ ఏకే మహంతి(Cyberabad CP AK Mohanthy) దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

President Draupadi Murmu Visit Bollaram Rashtrapati Nilayam : రాష్ట్రపతి కాన్వాయ్​ వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీసులు, ఇంటెలిజెన్స్​ సిబ్బంది పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి విడిది కాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు(Traffic Restrictions) చేయనున్నారు. సోమవారం సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి వై జంక్షన్​, బొల్లారం జంక్షన్​, నేవీ జంక్షన్​, యాప్రాల్​ రోడ్​, బైసన్​ గేట్​, లోతుకుంట జంక్షన్​ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నట్లు ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు. అందుకు వాహనదారులు అందరూ ట్రాఫిక్​ వారికి సహకరించాలని కోరారు. అందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు.

Women Reservation Bill President : మహిళా రిజర్వేషన్లకు రాష్ట్రపతి గ్రీన్​సిగ్నల్.. చట్టంగా మారిన బిల్లు.. కేంద్రం గెజిట్

ఏర్పాట్లు పూర్తి : బొల్లారం రాష్ట్రపతి నిలయానికి శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రావడంతో అక్కడి నివాసంలో దాదాపు అన్ని పనులను ఉన్నతాధికారులు పర్యవేక్షించి, పూర్తి చేశారు. ఈ క్రమంలో ఈ నెల 11 నుంచి 25 వరకు రాష్ట్రపతి నిలయం సందర్శనను రద్దు చేశారు. రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో బందోబస్తును కూడా భారీగా పెంచారు.

బొల్లారం రాష్ట్రపతి నిలయం చరిత్ర : దేశ పరిపాలన కేవలం ఉత్తర భారతదేశానికే పరిమితం కాకూడదని, దక్షిణ భారతదేశంలో కూడా ఏర్పాటు చేయాలని హైదరాబాద్​ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నిర్మించారు. ఈ నిలయం దిల్లీలోని రాష్ట్రపతి భవన్​కు దీటుగా ఉంటుంది. 1805లో బ్రిటీష్​ అధికారులు బొల్లారం రాష్ట్రపతి నిలయాన్ని నిర్మించారు. అప్పట్లో వైశ్రాయ్​ అతిథి గృహంగా పిలిచే వారు, అనంతరం స్వాతంత్య్రం వచ్చిన 1950లో కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి రాష్ట్రపతి నిలయంగా పిలుస్తూ వస్తున్నారు. ఈ భవనానికి సుమారు 160 ఏళ్ల చరిత్ర ఉంది. రెండోసారి బొల్లారం రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు.

ఇకపై సంవత్సరం పొడవునా రాష్ట్రపతి భవనం సందర్శించొచ్చు..

రాజసం.. ఆతిథ్యం.. బొల్లారం నిలయం..

ABOUT THE AUTHOR

...view details