President Draupadi Murmu Hyderabad Tour : ప్రతి శీతాకాలానికి భారత రాష్ట్రపతి హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి విడిది చేయడానికి వస్తుంటారు. ఈ క్రమంలోనే నేడు హైదరాబాద్‌కు దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.
President Draupadi Murmu Hyderabad Tour Today : ఈరోజు సాయంత్రం 6:25 గంటలకు రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి (Bollaram Rashtrapati Nilayam) 7:00 గంటలకు ప్రవేశించి సేద తీరి, కొన్ని రోజులు ఇక్కడే ఉండనున్నారు. బొల్లారం నిలయానికి వెళ్లే మార్గాల్లో రాష్ట్రపతి కాన్వాయ్‌కు సంబంధించి అధికారులు శనివారం రిహార్సల్ కూడా చేశారు. ఈ ఏర్పాట్లు మొత్తాన్ని సైబరాబాద్ సీపీ ఏకే మహంతి(Cyberabad CP AK Mohanthy) దగ్గరుండి పర్యవేక్షించారు.
ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతి మరవొద్దు: రాష్ట్రపతి
President Draupadi Murmu Visits Bollaram Rashtrapati Nilayam : ద్రౌపది ముర్ము కాన్వాయ్ వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి విడిది కాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు(Traffic Restrictions) చేయనున్నారు. ఈరోజు సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి వై జంక్షన్, బొల్లారం జంక్షన్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, బైసన్ గేట్, లోతుకుంట జంక్షన్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.